News August 9, 2025

పాడేరు: సీఎంకి రాఖీ కట్టిన మంత్రి సంధ్యారాణి

image

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పాడేరు మండలం వంజంగిలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన వివిధ ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాఖీ కట్టారు. అనంతరం ఆమెను సీఎం ఆశీర్వాదించారు.

Similar News

News August 9, 2025

NLG: న్యాయం చేయాలని పోలీసులకు రాఖీ కట్టి..!

image

రాఖీ పండుగ వేళ నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ నకిరేకల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి డ్యూటీలో ఉన్న సిబ్బందికి రాఖీ కట్టింది. తాటికల్లు గ్రామంలోని బాట పంచాయితీ వివాదంలో తన భర్త ముచ్చపోతుల వెంకన్నపై జంజిరాల వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును త్వరగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది.

News August 9, 2025

గిరిజనుల పిల్లలను పాఠశాలలకు పంపాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉన్న చెంచుగూడాలలోని తల్లిదండ్రులు వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని పాఠశాలలకు పంపాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతి కోసం భుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

News August 9, 2025

ప్రజలకు కడప ఎస్పీ హెచ్చరిక

image

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వాట్సప్ కూడా హ్యాక్ కావొచ్చని, ఫోన్ హ్యాక్ అయితే మోసపోతామని చెప్పారు. ప్లే స్టోర్‌ తప్ప ఇతర వేదికల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.