News September 20, 2025

పాడేరు: 10 వేల హెక్టార్లలో రాజ్ మా సాగు

image

పాడేరు జిల్లాలో ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో రాజ్ మా పంట సాగవుతోంది. ఇందుకు అవసరమైన రాజ్ మా విత్తనాలను ప్రతి మండలానికి అందజేసినట్లు జిల్లా వ్యసాయ అధికారి SBN నంద్ తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు 4,900 క్వింటాళ్ళ విత్తనాలను సబ్సిడీ ధరకు అందజేశామన్నారు. గత ఏడాది 4,500 క్వింటాళ్ళ విత్తనాలు సరఫరా చేయగా 9వేల హెక్టార్లలో ఈ పంట సాగయ్యిందన్నారు. రాజ్ మా సాగులో విత్తన శుద్ధి తప్పనిసరి అన్నారు.

Similar News

News September 20, 2025

ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతం: ఎంపీ కావ్య

image

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎంపీ కడియం కావ్య హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. కులం, మతం, బీద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మహిళ కలిసి మెలిసి ఆడుకుంటారని తెలిపారు. ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకు సొంతమన్నారు.

News September 20, 2025

NLG: దరఖాస్తుల ఆహ్వానం.. ఈనెల 30 లాస్ట్

image

2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను స్వచ్చంద సంస్థలు/ ప్రభుత్వేతర సంస్థలు.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థలలకు ఆర్థిక సహాయం అందించుటకు గాను అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలోని, రిజిస్టర్డ్ స్వచ్చంద సంస్థలు/ప్రభుత్వేతర సంస్థలు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 20, 2025

GST ఎఫెక్ట్.. సిలిండర్ ధర తగ్గుతుందా?

image

ఈనెల 22 నుంచి GST కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో నిత్యావసరాలతో పాటు చాలా వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. అయితే నిత్యం వాడే వంటగ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గుతుందా అనే సందేహం సామాన్యుల్లో నెలకొంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై 5%, కమర్షియల్ సిలిండర్‌పై 18% GST అమల్లో ఉంది. ఇకపైనా ఇదే కొనసాగనుంది. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.905 ఉంది.