News February 5, 2025
పాడేరు: 12వేల మంది విద్యార్ధులతో యోగాసనాలు

వచ్చేనెల 8వ తేదీన 12వేల మంది విద్యార్థులతో యోగాసనాలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఏటీడబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను మంగళవారం ఆదేశించారు. యోగా వలన కలిగే ప్రయోజనాలు వారిని అడిగి తెలుసుకున్నారు. యోగాసనాలు నేర్చుకున్న విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితిపై ఆరా తీశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 5, 2025
కొనరావుపేట: అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం

కొనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న నిజామాబాద్‌కు చెందిన బద్దెపురి నారాయణ(80) కనిపించకుండా పోయాడు. వృద్ధుడి కుమారుడు నవంబర్ 3న కొనరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వృద్ధుడి మృతదేహం రిజర్వాయర్లో కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 5, 2025
రాజమండ్రి: సాయిబాబా శత జయంతికి కలెక్టర్‌కు ఆహ్వానం

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కలెక్టర్ చేకూరి కీర్తికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఉత్సవాలకు ప్రధాని మోదీతో హాజరవుతున్నారని తెలిపారు. కలెక్టర్ తప్పనిసరిగా విచ్చేయాలని వారు కోరారు.
News November 5, 2025
నవంబర్ 10-19 వరకు సమ్మేటివ్ పరీక్షలు

AP: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతులకు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, 6, 7 క్లాసులకు మ.1.15 నుంచి సా.4.15 వరకు జరుగుతాయి. 8-10 తరగతులకు ఉ.9.15 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.


