News September 12, 2025
పాడేరు: 12 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి

పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో 12 నుంచి పర్యాటకులకు పద్మాపురం గార్డెన్‌లో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇందులో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.
Similar News
News September 12, 2025
రైతులతో మాట్లాడుతూ రాజధానిని విస్తరిస్తాం: చంద్రబాబు

AP: అమరావతి రెండో విడత భూసేకరణపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వారిని ఆదుకుంటాం. విమానాశ్రయం, పెద్దపెద్ద సంస్థలు రావాలి. నేను ఇక్కడే ఆగిపోతే అభివృద్ధి నిలిచిపోతుంది. భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులు కావాలంటే ఇంకా ల్యాండ్ కావాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ రాజధానిని విస్తరిస్తాం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.
News September 12, 2025
మెరుగైన వైద్య సేవలు అందించాలి: జగిత్యాల కలెక్టర్

ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం అంబర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను, హాజరును పరిశీలించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ తదితరులు ఉన్నారు.
News September 12, 2025
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఇది కేంద్రీకృతమైందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.