News December 23, 2025

పాడేరు: WOW.. అద్భుతం ఈ PHOTO

image

పాడేరు సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండ హిమగిరి సొగసును తలపిస్తోంది. హిమాలయ పర్వతాలను తలపిస్తోన్న వంజంగి మేఘాల కొండ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వరుసగా గుట్టలు, పర్వతాలు, వాటిపై పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. దీనికి సంబంధించిన పై ఫొటో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

Similar News

News December 23, 2025

అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచాలి: జిల్లా కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ముమ్మర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ రవాణా జరిగే ప్రధాన కూడళ్లలో తక్షణమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

News December 23, 2025

నంద్యాల-గుంతకల్లు మధ్య పగటి పూట రైలు

image

రైలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మధ్య పగటి పూట రైలుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎంపీ డా.బైరెడ్డి శబరి తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమె చేసిన విన్నపానికి స్పందిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ రైలు సౌకర్యాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రైలు (57407/08) త్వరలోనే పట్టాలెక్కనుంది.

News December 23, 2025

వరల్డ్ రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో ఒకే ఓవర్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ఇండోనేషియా పేసర్ గేడే ప్రియాందన నిలిచారు. కాంబోడియాతో మ్యాచులో ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20Iల్లో గతంలో మలింగా(SL), రషీద్ ఖాన్(AFG), కర్టిస్ కాంఫర్(IRE), హోల్డర్(WI) ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టారు. ఇక డొమెస్టిక్ క్రికెట్‌లో సింగిల్ ఓవర్లో 5 వికెట్లు తీసిన రికార్డు BAN బౌలర్ అల్ అమీన్, IND ప్లేయర్ అభిమన్యు మిథున్ పేరిట ఉంది.