News April 25, 2024
పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.
Similar News
News April 22, 2025
తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మృతులు ముత్తుకూరు చెందిన వడ్డే ఈరన్న, శ్రావణిగా గుర్తించారు. బాలిక చిప్పగిరి KGBV పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో కుమార్తెను తండ్రి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా లారీ ఢీకొని దుర్మరణం చెందారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News April 22, 2025
కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీ కూతుళ్లు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి, కూతురు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనగా తండ్రీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆస్పిరి మండలం ముత్తుకూరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 22, 2025
రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.