News January 16, 2026

పాణ్యం మండలంలో విషాదం

image

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News February 7, 2026

పెద్దపల్లి: అక్రిడేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

2026-28 సంవత్సరాలకు సంబంధించి అక్రిడేషన్ కార్డుల జారీకి అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి అక్రిడేషన్ కార్డుల జారీకి యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో ఈనెల 9 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 7, 2026

చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి: YCP

image

CBN హయాంలోనే తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని YCP ఆరోపించింది. ‘చంద్రబాబు CM అయ్యాక నాణ్యత లేదని TTD 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్‌ చేసింది. అవే మరో పేరుతో చంద్రబాబు CMగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వస్తే TTD ఆమోదించింది. వాటినే లడ్డూ తయారీకి వాడారని స్వయంగా CBI వెల్లడించింది. CBN ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాసింది. మరి ఈ పాపాలు ఎవరివి బాబూ?’ అంటూ ట్వీట్ చేసింది.

News February 7, 2026

అనంతపురానికి కార్పొరేట్ సంస్థల క్యూ: ఎమ్మెల్యే ప్రసాద్

image

అనంతపురం నగరానికి కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయని MLA దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శనివారం సుభాష్ రోడ్డులో ఓ జువెలరీ మాల్‌ను ‘రాజాసాబ్’ హీరోయిన్ మాళవిక మోహన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహానగరాల స్థాయిలో అనంతపురం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. నగరానికి వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.