News August 26, 2025
పాతపట్నం ఎమ్మెల్యే అస్వస్థతకు గురి.. పరామర్శించిన కేంద్ర మంత్రి

పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. ఇటీవల కాలంలో పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడంతో అనారోగ్యానికి గురి అయ్యారు. విశాఖ పట్నంలో చికిత్స పొందుతున్న ఆయనకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాచారం అందుకొని ఆయనను పరామర్శించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటూ ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
Similar News
News August 26, 2025
SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులు ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించబడనున్నాయన్నారు.
News August 25, 2025
ఎల్.ఎన్.పేటని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి

ఎల్.ఎన్.పేట మండలాన్ని జిల్లాలోనే కొనసాగించాలని స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు తీర్మానం చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు విజ్ఞప్తి పత్రం అందజేశారు. టెక్కలి రెవిన్యూ డివిజన్‌కి కాకుండా శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఉంచాలని వారు కోరారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి తమ అభ్యర్థనను సమర్పించారు.
News August 25, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి వచ్చే అర్జీలు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 55 అర్జీలు వచ్చాయన్నారు.