News April 5, 2024

పాతపట్నం: 81 ఓట్లతో MLAగా గెలిచి!

image

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పెంటన్నాయుడు, కెఎల్పి ఎమ్‌ఎస్‌నారాయణపై 81 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే 1989లో కె.మోహన్‌రావు (టీడీపీ), డి.నారాయణరావు (కాంగ్రెస్)పై 274 ఓట్లతో ఓడించి MLA అయ్యారు.

Similar News

News December 20, 2025

వజ్రపుకొత్తూరు: బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం

image

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

News December 20, 2025

శ్రీకాకుళంలో సరిపడా యూరియా నిల్వలు

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీనాథ స్వామి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. అక్టోబరు 1 నుంచి ఇప్పటివరకు 7,811 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు, మార్క్ ఫెడ్ ప్రైవేట్ డీలర్ల వద్ద 2,020 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు.

News December 20, 2025

ఎచ్చెర్ల: అధ్యయనపర అవగాహన ఒప్పందం

image

ఎచ్చెర్లలోని డా.B.R.అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా (అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేక అధ్యయనపర అవగాహన ఒప్పందాన్ని శుక్రవారం కుదుర్చుకున్నారు. డా.B.R.అంబేడ్కర్ వర్సిటీ VC రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యూనివర్సిటీ సచ్చిదానంద మూర్తి మత సామరస్య, శాంతి అధ్యయనాల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయన్నారు.