News August 13, 2025
పాతబస్తీకి మెట్రో.. రూ.360 కోట్ల పరిహారం: NVS రెడ్డి

పాతబస్తీ మెట్రో ఆస్తుల సేకరణలో భాగంగా ఇప్పటి వరకు 412 నిర్మాణాలకు పరిహారం ప్రకటించినట్లు MD NVS రెడ్డి తెలిపారు. 380 ఇళ్లను కూల్చివేయగా రూ.360 కోట్ల పరిహారం చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో కారిడార్ పిల్లర్లకు తగిన స్థలాల ఎంపిక చేసి మార్కింగ్ పనులు పూర్తి చేసి భూ సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
HYD: పాదచారులకు పనిచేయని పెలికాన్!

గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధి 78 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇవి కొన్నిచోట్ల పని చేయడం లేదని, రోడ్డు దాటాలంటే ఇబ్బందులు తప్పడం లేదని పాదచారులు వాపోతున్నారు. స్విచ్ బోర్డులు సైతం పని చేయడం లేదన్నారు. ఇదిలా ఉంటే మరో 135 చోట్ల కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని ఇటీవల GHMC తెలిపింది. ముందు పాత బోర్డులు సరిచేసి, కొత్తవి ఏర్పాటు చేస్తే బెటర్ అని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు.
News August 13, 2025
HYD: ‘మార్చి నాటికి స్టీల్ బ్రిడ్జి పూర్తి’

మలక్‌పేట, నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 2.58 కి.మీ పొడవైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మలక్‌పేట ఎమ్మెల్యేతో కలిసి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, ఇంజినీరింగ్ అధికారులకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే రహదారి రద్దీ తగ్గనుంది.
News August 13, 2025
పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం

MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మొదట 1,100 ఆస్తులు సేకరించాల్సి ఉన్నట్లుగా మెట్రో రైలు సంస్థ తెలిపింది. ఇటీవల ఇంజినీరింగ్ నిపుణుల బృందం అలైన్‌మెంట్ సరిదిద్దడంతో ఆస్తుల సంఖ్య 900కు తగ్గినట్లుగా ఎండీ NVS రెడ్డి ప్రకటించారు. దీంతో ఆస్తుల కూల్చివేత, రోడ్డు విస్తరణ, పిల్లర్స్ మార్కింగ్ పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.