News September 21, 2025
పాతబస్తీ పనుల్లో వేగం పెంచండి: మెట్రో MD

HYD మెట్రో రైల్ ప్రాజెక్టుపై HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో మొదటి దశ, ముఖ్యంగా పాత నగరంలో పనులను వేగవంతం చేయాలని, సవాళ్లను అధిగమించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టునూ సమీక్షిస్తూ, సీఎం మార్గదర్శనంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 21, 2025
PDPL: ఇద్దరు యువకులపై కత్తిపోట్లు.. పోలీసుల దర్యాప్తు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం కృష్ణానగర్‌కు చెందిన కుమారస్వామితో పాటు భాస్కర్‌పై గుర్తుతెలియని వ్యక్తి శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు. ఇంటి వద్దనే ఈ ఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామి, భాస్కర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
News September 21, 2025
PDPL: కలెక్టర్‌పై ఆరోపణలు ఖండించాలి: శంకర్

PDPL కలెక్టర్‌పై నిరాధార ఆరోపణలను టీజ్యాక్ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. RGMలోని ఆశ్రమ పాఠశాల భూ కేటాయింపులో కలెక్టర్ డబ్బులు అడిగారని కొన్నివర్గాలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. కలెక్టర్ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తుండగా, ఈ తరహా ఆరోపణలు ఉద్యోగుల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ పటిష్ఠంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
News September 21, 2025
మరికొన్ని గంటల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత జట్టు అంచనా!

ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్vsపాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడగా మ్యాచ్ ఆడటంపై అనిశ్చితి నెలకొనడంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా వచ్చే ఛాన్స్ ఉందని NDTV తెలిపింది.
టీమ్ అంచనా: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్