News September 12, 2025

పాతబస్తీ మెట్రో.. రూ.433 కోట్ల పరిహారం విడుదల

image

పాతబస్తీ మెట్రో పనులపై MD NVS రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భవన కూల్చివేత సాగుతుండగా రూ.433 కోట్ల పరిహారం విడుదల చేశారు. ప్రత్యేక నోటీసులో అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటివరకు పాతబస్తీ మెట్రో రూట్‌లో దాదాపు 550 భవనాల కూల్చివేత పూర్తయినట్లు వెల్లడించారు.

Similar News

News September 12, 2025

KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

image

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

News September 12, 2025

HYD: ఈ మెట్రో రైలు మాకొద్దు బాబోయ్: L&T

image

HYDలో లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తున్న మెట్రో రైల్ నిర్వహణ తమకు చేతకావడం లేదని.. ఖర్చులు పెరిగిపోతున్నాయని L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు రూ.5వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని.. రోజూ వచ్చే టికెట్ ఆదాయం సరిపోవడం లేదని.. ఇలా అయితే ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

News September 12, 2025

HYD: రాష్ట్ర చిహ్నాలతో రాస్తాకు అందం

image

కూడళ్ల వద్ద ఎక్కువగా మహనీయుల విగ్రహాలే వెలిగిపోతుంటాయి. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌లో ఈ దృశ్యం విభిన్నంగా మెరిసిపోతోంది. TG గౌరవ చిహ్నాలను శిల్పకళాఖండంగా ప్రతిష్ఠించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇరువైపులా TG రాష్ట్ర జంతువులు మచ్చల జింకలు, మధ్యలో రాష్ట్ర పక్షి పాలపిట్ట సోయగం విరజిమ్ముతూ కనువిందు చేస్తోంది. ప్రయాణికుల చూపులను కట్టిపడేస్తోంది. మనసు దోచేస్తోంది.