News October 19, 2025

పాతమాగులూరు: హత్య కేసులో బెయిల్ మంజూరు

image

సంతమాగులూరు మండలం పాత మాగులూరులో బెంగళూరుకు చెందిన వీరస్వామి రెడ్డి, వీరస్వామి రెడ్డి జులై 23న నరసరావుపేటలో కిడ్నాప్‌నకు గురయ్యారు. అనంతరం అదేరోజు మండలంలోని పాత మాగులూరు వద్ద హత్యకు గురయ్యారు. అదే నెల 27న బాదం మాధవరెడ్డి సహా 12 మంది ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధించి శనివారం మాధవరెడ్డితో సహా 11 మందికి బెయిల్ మంజూరైంది.

Similar News

News October 19, 2025

HYD: దీపావళి వేళ.. గుర్తుంచుకోండి ఈ నంబర్లు

image

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తాం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ కోరారు. 24 గంటల పాటు సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు. ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 101, 112, 9949991101 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.

వంటింటి చిట్కాలు

image

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.