News February 14, 2025

పాత గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్‌డెడ్

image

పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

విశాఖలోని 13 రైతు బజార్లో నేటి కాయగూరల ధరలు

image

విశాఖ 13 రైతు బజార్‌లో శుక్రవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ 38,మిర్చి రూ.26, బెండ రూ.44, బీరకాయలు రూ.50, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.36/40, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, కాకరకాయ రూ.42,పొటల్స్ రూ.90, దోసకాయలు రూ.28గా నిర్ణయించారు.

News March 14, 2025

విశాఖ నుంచి షాలిమార్, చర్లపల్లికి ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి షాలిమార్(08577/78), చర్లపల్లికి(08579/80) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16 తేదీన బయలుదేరి మార్చి 17న తిరుగు ప్రయాణంలో విశాఖ చేరుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News March 14, 2025

విశాఖ: మోసం చేసిన ఏడుగురికి ఐదేళ్ల జైలు

image

పెందుర్తిలో 2017 FEBలో 158.66 చదరపు గజాల ప్లాట్‌ను ఓ వ్యక్తికి రూ.18లక్షలకు విక్రయించారు. తరువాత అమ్మకందారుడు మరికొందరితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ ప్లాట్‌ను వేరొకరికి కూడా విక్రయించారు. దీంతో బాధితుడు కేసు పెట్టాడు. విచారించిన జిల్లా ఎస్.సి&ఎస్.టి కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురికి 5 ఏళ్ల జైలు, ఒక్కొక్కరూ రూ.2,90,000 చొప్పున బాధితునికి నష్ట పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.

error: Content is protected !!