News October 9, 2025
పాత మహిళా పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ

అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎస్పీ జగదీశ్ గురువారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి, ఆ స్థలంలో నూతన భవనాలు నిర్మిస్తే పోలీస్ శాఖకు ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం సిబ్బంది క్వార్టర్స్, ఖాళీ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు.
Similar News
News October 10, 2025
APPSC బోర్డు ఛైర్మన్‌గా ప్రొఫెసర్ శశిధర్ నియామకం

APPSC బోర్డు ఛైర్మన్‌గా ప్రొఫెసర్ సి.శశిధర్ నియమితులయ్యారు. ఈయన అనంతపురం JNTUలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2000-06 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 2006-12 వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2012 నుంచి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో సీఎం చంద్రబాబు చేతుల మీదగా బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్బంగా JNTUలోని విద్యార్థులు ఆయనను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
News October 10, 2025
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక

బెలుగుప్ప మండలం గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం రామాంజనేయులు గురువారం చెప్పారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం జిల్లాస్థాయి పోటీలు జరిగాయి. గంగవరం పాఠశాలకు చెందిన తేజశ్రీ, శివానంద్, నవ్య, హర్షియా రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వారిని అభినందించారు.
News October 8, 2025
పిడుగు పాటుకు రైతు, ఎద్దు మృతి

పిడుగు పడి రైతు గోవిందు (65), అతనితో పాటు ఉన్న ఎద్దు మృతి చెందిన ఘటన కణేకల్లు మండలం గరుడచేడులో బుధవారం చోటు చేసుకుంది. మరో ఇద్దరు షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.