News April 3, 2025
పాన్‌గల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. రేమద్దులకి చెందిన పర్వతాలు(47)కి ఐదెకరాల పొలం ఉంది. ఆ పొలం అంచున ఓ కాల్వ ఉండగా.. అందులో నుంచి మోటార్ ద్వారా పంటకు నీరు పారిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కరెంట్ లేదనుకుని మోటార్‌లో పట్టిన నాచును తొలగిస్తుండగా.. విద్యుత్ సరఫరా అయ్యి మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News July 5, 2025
విద్యా కిట్లు వెంటనే అందించాలి: పద్మశ్రీ

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన వసతులు, సరైన ఆహారం, అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ పద్మశ్రీ అన్నారు. శనివారం ఏలూరులో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యా కిట్ల పంపిణీ కొన్ని మండలాల్లో ఆలస్యం అయినట్లు గుర్తించామన్నారు. కిట్స్ వెంటనే అందించాలన్నారు.
News July 5, 2025
శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్

టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా అవతరించారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ ఫస్ట్ ఇన్నింగ్సులో 269, రెండో ఇన్నింగ్సులో 80 రన్స్ కలిపి 349* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ (344) రికార్డును ఆయన చెరిపేశారు. వీరిద్దరి తర్వాత లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319) ఉన్నారు.
News July 5, 2025
‘లోక్ అదాలత్‌లో 116 కేసులు రాజీ’

పార్వతీపురం మన్యం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌లో 116 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు అన్నారు. న్యాయస్థానం ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి సహకరించడం శుభ పరిణామం అన్నారు.