News April 21, 2025
పాన్‌గల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

పాన్‌గల్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న గోప్లాపూర్‌కి చెందిన గందం చిన్న రాములు ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతుడికి భార్య జ్యోతి, కూతురు ఉన్నారు. కాగా భార్యాభర్తలు ఇద్దరు దివ్యాంగులు కావడంతో పాటు నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News April 21, 2025
నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
News April 21, 2025
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

జనగామ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10:30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమంలో మండలాల ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా మండలాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
News April 21, 2025
IPL రోబోటిక్ డాగ్ పేరు ఏంటంటే?

ఐపీఎల్‌లో కనిపిస్తున్న రోబోటిక్ డాగ్(కెమెరా)కు పేరు పెట్టారు. ఇటీవల నిర్వహించిన పోల్‌లో మెజారిటీ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ‘చంపక్’ అని పేరు పెట్టినట్లు IPL అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ‘మీట్ చంపక్’ అని రాసుకొచ్చింది. ఆటగాళ్లతోనూ, చీర్ లీడర్స్‌తోనూ ఈ రోబోటిక్ డాగ్ సందడి చేసిన వీడియోలు వైరలయ్యాయి.