News February 10, 2026
పాన్ కార్డు రూల్స్‌లో మార్పులు!

పాన్ కార్డు రూల్స్‌లో పలు మార్పులను కేంద్రం ప్రతిపాదించింది. ఒక FYలో ₹10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్లు/విత్ డ్రాలు చేస్తే పాన్ తప్పనిసరి. ప్రస్తుతం బ్యాంకుల్లో ఒక రోజులో లావాదేవీలు ₹50 వేలు దాటినా అడుగుతున్నారు. కొత్త వాహనం విలువ ₹5 లక్షలు, హోటల్ ఖర్చు ₹లక్ష దాటినా సమర్పించాలి. స్థిరాస్తి అమ్మకం/కొనుగోలు విలువ ₹20 లక్షలు దాటినా పాన్ నంబర్ ఇవ్వాలి. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలయ్యే అవకాశం ఉంది.
Similar News
News April 13, 2026
పెదపరిమిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెదపరిమిలో రెండో విడత భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. 6,000 ఎకరాల్లో తొలి దశగా 3,072 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే కనెక్టివిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు ఈ భూములు వినియోగించనున్నారు.
News April 13, 2026
నిధులిచ్చాం.. తేడా వస్తే మీ తప్పే: చంద్రబాబు

AP: పాఠశాలల పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులు ఉండాలని సమీక్షలో స్పష్టం చేశారు. ఇప్పటికే నిధులు అందించామని అయినా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుందన్నారు. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు.