News October 7, 2025

పాపన్నపేట: వ్యాపార విభేదాలతోనే హత్య.. నలుగురి అరెస్టు

image

పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలో యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మెదక్ రూరల్ సీఐ జార్జ్ తెలిపారు. వ్యాపార విభేదాల కారణంగానే ఆదివారం రాత్రి మహబూబ్‌ను హత్య చేశారని పేర్కొన్నారు. ఏడుపాయల బ్రిడ్జి వద్ద మహబూబ్‌పై ఉద్దేశపూర్వకంగా కర్ర విట్టల్, విటల్ భార్య రాజమణి, కొడుకులు యాదగిరి, మహేష్ దాడి చేయడంతో మృతి చెందినట్లు వివరించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.

Similar News

News October 6, 2025

ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు: కలెక్టర్

image

ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005, ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయి చట్టంగా ఉందని తెలియజేశారు. ముఖ్యమైన చట్టం అమలులోకి వచ్చినందుకు ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరుల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

News October 6, 2025

మెదక్: ఈనెల 8న కేంద్ర బృందం పర్యటన

image

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ, NRSCకి చెందిన అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

News October 6, 2025

మనోహరాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాలకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. నోబుల్ కళాశాలలో సౌకర్యాలు, భద్రత, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.