News March 31, 2025

పాపిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ

image

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో గుడికి వెళ్లి వస్తున్న సమయంలో ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న గొడవలో లింగమయ్య అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ పాపిరెడ్డిపల్లి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. గొడవలకు దారి తీసిన కారణాలను మృతుని కుటుంబ సభ్యుల ద్వారా ఆరా తీశారు. మృతికి కారకులైన బాధ్యులపై అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 19, 2026

GK: ఫిబ్రవరిలో ముఖ్య రోజులు

image

feb 4: ప్రపంచ క్యాన్సర్ దినం
feb 10: ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం
feb 11: అంతర్జాతీయ బాలిక, మహిళల విజ్ఞాన దినోత్సవం
feb 13: ప్రపంచ రేడియో దినోత్సవం
feb 20: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
feb 21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
– ప్రతిరోజూ 2amకు జనరల్ నాలెడ్జ్ కంటెంట్ పొందండి

News February 19, 2026

తగ్గిన చింతపండు ధరలు

image

రాయదుర్గం మార్కెట్ యార్డుకు బుధవారం 232.5 క్వింటాళ్ల చింతపండు వచ్చినట్లు కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన చింతపండులో క్వింటా ఫ్లవర్ రకం గరిష్ఠంగా రూ.10,200, కనిష్ఠంగా రూ.5,500 పలికింది. కరిపులి రకం గరిష్ఠంగా రూ.16,300, కనిష్ఠంగా రూ.13,000 ధర పలికినట్లు వెల్లడించారు. ప్రతి బుధవారం మార్కెట్‌లో చింతపండు విక్రయాలు జరుగుతాయని ఆయన వివరించారు.

News February 19, 2026

వాళ్లు ఇండియాను ఓడించలేదు: పాక్ క్రికెటర్

image

ఇండియాతో మ్యాచ్‌లో పాక్ <<19153355>>ఘోరంగా<<>> ఓడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో తమపై <<19155191>>తీవ్ర విమర్శలు<<>> చేస్తున్న మాజీలకు పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. ‘మాజీ క్రికెటర్లకు వాళ్ల సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు దిగ్గజాలు. కానీ మేం చేసినట్లు వాళ్లు చేయలేదు. మేం ప్రపంచకప్‌లో ఇండియాను ఓడించాం. అయినా విమర్శలనేవి క్రికెట్ చరిత్రలో భాగం’ అని అన్నారు. 2021 T20 WCలో ఇండియాపై పాక్ గెలిచింది.