News April 7, 2025

పాపిరెడ్డిపల్లెకు వైఎస్ జగన్.. హెలిప్యాడ్‌ మార్పు!

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్ జగన్ అక్కడ ల్యాండ్ అయ్యేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పాపిరెడ్డిపల్లెలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

Similar News

News April 7, 2025

కుటుంబ సభ్యులపై నీచపు రాజకీయాలా?: తోపుదుర్తి

image

బంధువుల అమ్మాయితో తాను ఎయిర్‌పోర్టులో మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేస్తూ టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘రేపు జగన్ పాపిరెడ్డిపల్లెకు వస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా బంధువులు, కుటుంబసభ్యులను నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని ట్వీట్ చేశారు.

News April 7, 2025

రామగిరి హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది తనిఖీలు

image

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 8వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.00 గంటలకు రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మంగళవారం హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది పరిశీలించారు.

News April 7, 2025

నేటి నుంచి ఎండతీవ్రత

image

అనంతపురం జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తరచూ నీరు తాగాలని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!