News March 20, 2025

పామాయిల్ సాగుతో లాభాలు: వనపర్తి కలెక్టర్

image

పామాయిల్ సాగు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. రైతులకు అవగాహన కల్పించి పామాయిల్ సాగుకు ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. పంట సాగు 4 సంవత్సరాల వరకు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, పంటను కంపెనీ వారే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు చూసుకుంటే 35 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు.

Similar News

News March 21, 2025

ALERT.. మూడు రోజులు వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, MNCL, ఉమ్మడి కరీంనగర్, BHPLతో పాటు మరికొన్ని చోట్ల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, YSR, నంద్యాల, ప్రకాశం, పల్నాడులో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

News March 21, 2025

VKB: టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

image

నేటి నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. >SHARE IT

News March 21, 2025

అన్నమయ్య: మహిళను రేప్ చేసిన వ్యక్తిపై కేసు.!

image

మహిళను నమ్మించి నయవంచనకు గురి చేయడమే కాకుండా, అత్యాచారానికి పాల్పడి ఆపై అబార్షన్ చేయించిన వ్యక్తిపై మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ ఎరిసావలి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేశ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్‌పై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

error: Content is protected !!