News October 4, 2025

పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి తుమ్మల

image

దమ్మపేట మండలం లింగాలపల్లిలో జరిగిన తెలంగాణ పామాయిల్ రైతుల సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాంప్రదాయ పంటలైన పత్తి, మిర్చితో పోలిస్తే పామాయిల్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.

Similar News

News October 5, 2025

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు కమిటీ వేసిన BJP

image

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు పార్టీ తరఫున ఎవరిని నిలబెడితే బాగుంటుందో నేతల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుంది. M.ధర్మారావ్(Ex. MLA), పోతుగంటి రాములు(Ex.MP), బీజేపీ సీనియర్ నేత కోమల ఆంజనేయులు(అడ్వకేట్)ను కమిటీ సభ్యులుగా నియమించారు.

News October 5, 2025

MDK: బైక్‌ దొంగకు నిప్పు.. ఒకరి పరిస్థితి విషమం

image

మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్‌ దొంగిలిస్తున్న యేవాన్, మహిపాల్‌లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో వారి జేబులోని పెట్రోల్‌తో ఒకరిపై నిప్పంటించారు. మంటలు ఆర్పిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యేవాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరొ దొంగ మహిపాల్‌పై ఇది వరకు పోక్సో కేసు ఉందని పోలీసులు తెలిపారు.

News October 5, 2025

నిజాసాగర్ 6గేట్ల నుంచి 51,761 క్యూసెక్కులు విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రం 51,761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 6 వరద గేట్లను ఎత్తి 51,762 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.687 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.