News April 16, 2025
పామిడి విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన పామిడి యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
Similar News
News November 10, 2025
పెదిర్పహాడ్‌లో చిరుత సంచారం.. గ్రామస్థుల భయాందోళన

మద్దూరు మండలం పెదిర్పహాడ్‌లో సోమవారం సాయంత్రం చిరుత పులులు సంచరించాయి. దీంతో గ్రామస్థులు భయంతో గజగజలాడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే గుట్టల వద్దకు చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు గ్రామస్థులకు సూచించారు.
News November 10, 2025
నిజామాబాద్: ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజమాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను అందించవచ్చని సూచించారు.
News November 10, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.


