News November 5, 2024

పామూరు: మద్యం మత్తులో ముగ్గురిపై కత్తితో దాడి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన పామూరు మండలం నుచ్చుపొదలలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. తిరుపాల్ రెడ్డి, సురేంద్ర శనివారం మద్యం మత్తులో గొడవపడ్డారు. సురేంద్ర స్థానిక నేత రహముతుల్లా సహాయంతో తిరుపాల్ రెడ్డిని పిలిపించి పంచాయితీ పెట్టారు. ఆగ్రహంతో తిరుపాల్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రహముతుల్లా కుమారుడు నిజాముద్దీన్, బంధువు హజరత్, సురేంద్రలపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.

Similar News

News December 26, 2024

ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య

image

జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్‌గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2024

ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం

image

ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News December 26, 2024

శానంపూడిలో యువతి ఆత్మహత్య 

image

సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.