News October 7, 2025

పాయకరావుపేట: తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థి మృతదేహం

image

పాయకరావుపేట మండలం పాల్మాన్‌పేట సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం గల్లంతయిన పాలిటెక్నిక్ విద్యార్థి అశోక్ (19) మృతదేహం లభ్యమయింది. మంగళవారం ఉదయం అదే మండలం కొర్లయ్యపేట సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. స్థానిక మత్స్యకారులు సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందజేశారు. సముద్ర స్థానం చేసి బయటకు వస్తుండగా పెద్ద కెరటం వచ్చి అశోక్‌ను లోపలికి లాక్కుపోవడంతో గల్లంతయిన విషయం తెలిసిందే.

Similar News

News October 7, 2025

చిత్తూరు: ధరలు తగ్గింపు పై అవగాహన కల్పించాలి

image

సూపర్ జీఎస్టీతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 7, 2025

వికారాబాద్: మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లేదు: మాజీ ఎమ్మెల్యే

image

మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఎన్నెపల్లిలోని BRS భవన్‌లో పార్టీ పట్టణ మైనారిటీ నాయకులతో సమావేశం అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముస్లిం మైనారిటీలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

News October 7, 2025

నిర్మల్‌: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

image

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.