News April 22, 2025
పారదర్శకంగా ఇసుక పంపిణీ ప్రక్రియ కొనసాగాలి: కడప కలెక్టర్

జిల్లాలో ఇసుక పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం కడప కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. ఇబ్రహీంపేట రీచ్‌లో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలన్నారు. ఎక్కడా అవకతవకలు జరగకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 21, 2025
కడప: మే 10న లోక్ అదాలత్ కార్యక్రమం

కడప జిల్లా వ్యాప్తంగా మే 10 తేదీన లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేసులు రాజీ పడే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.
News April 21, 2025
కడప: చెట్టును ఢీకొని ఇద్దరి మృతి

మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి వద్ద నిన్న <<16156996>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన నరసింహులు(26), బద్వేల్‌లోని రూపవరం పేటకు చెందిన ఝాన్సీ(26) బైకుపై పెంచలకోనకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. బద్వేలు ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి చెందాడు. మర్రిపాడు ఎస్ఐ కేసు నమోదు చేశారు.
News April 21, 2025
కడపలో భగ్గుమన్న భానుడు

కడప జిల్లాలో ఆదివారం భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలో 36 మండలాలు ఉండగా, అందులో 28 మండలాల్లో 40 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముద్దనూరు మండలంలో అత్యధికంగా 42.3 డిగ్రీలు, బద్వేలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వేడిగాలి, ఉక్కపోతులతో ప్రజలు అల్లాడిపోయారు. వృద్ధులు, చిన్నారులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.