News October 27, 2025
పారాది వంతెన వద్ద బందోబస్తు

బొబ్బిలి మండలం పారాది వంతెన వద్ద వాహనదారులు ఇబ్బందులు పడకుండా రాత్రి సమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాజ్వే పైనుంచి వరదనీరు ప్రవహించడంతో వాహనాలను వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. వంతెనపై రాత్రి కంటైనర్ లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్, కానిస్టేబుల్స్ క్రెయిన్ సహాయంతో లారీని బయటకు తీసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
Similar News
News October 27, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా పాసైన వారు అర్హులు. వెబ్‌సైట్: nests.tribal.gov.in. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 27, 2025
ADB: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్

టీజీఎస్ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇదివరకు సూపర్ లగ్జరీ, గరుడ, రాజధాని బస్సుల్లో మాత్రమే టికెట్ల కోసం ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా డిజిటల్ చెల్లింపులకు అవకాశం లభించింది. ADB- NRML-NZB రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులో ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. త్వరలో అన్ని బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
News October 27, 2025
KNR: నేడే LUCKY ‘డ్రా’ప్.. ఎంట్రీపాస్ MUST..!

2025 DEC 1- 2027 NOV 30 వరకు మద్యంషాపులు నిర్వహించేందుకు టెండర్‌దారులు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం టెండర్లకు సంబంధించి ‘లక్కీ డ్రా’ తీయనున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఎంట్రీపాసులు ఉంటేనే లోనికి అనుమతిస్తారు. ఫోన్లను పర్మిషన్ లేదు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 షాపులకు 7,584 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.228 కోట్ల ఆదాయం వచ్చింది.


