News October 28, 2025

పారాది వద్ద పొంగిన వేగావతి

image

మొంథా తుఫాన్ ప్రభావంతో వేగావతి నది వరద ఉదృతి పెరిగింది. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురవడంతో నది ప్రవాహం పెరగడంతో పారాది కాజ్ వే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. నది ఉదృతి పెరగడంతో నది పరివాహక ప్రాంతానికి ఎవరు వెళ్లవద్దని, పశువులు, గొర్రెలు, మేకలను తీసుకుని వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News October 28, 2025

సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలి: ASF అదనపు కలెక్టర్

image

దివ్యాంగుల ధ్రువపత్రం పునరుద్ధరణ, నూతన ధ్రువపత్రాల కోసం జిల్లాలో చేపట్టిన సదరం శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం ASF ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని సందర్శించి అభ్యర్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల తీరును పరిశీలించారు. అర్హులైన దివ్యాంగులకు ధ్రువపత్రాలు అందించేందుకు సదరం శిబిరాన్ని నిర్వహించనున్నారు.

News October 28, 2025

పాడేరు: ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిపివేత

image

మొంథా తుఫాను ప్రభావం పాడేరు, చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మంగళవారం రాత్రి 7నుంచి బుధవారం ఉదయం 6గంటల వరకు ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ రహదారులు, అన్ని రకాల రహదారుల ట్రాఫిక్‌పై ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మినహాయింపు ఉంటుందన్నారు.

News October 28, 2025

సంగారెడ్డి: ‘పాఠశాల నిధులను విడుదల చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదని అన్నారు.