News October 24, 2025
పారాది వద్ద రాకపోకలకు అంతరాయం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడంతో వేగవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరగడంతో బొబ్బిలి మండలం పారాది కాజ్వే పైనుంచి వరదనీరు పారుతోంది. దీంతో వాహనాలు రాకపోకలను నిలిపి వేశారు. వాహనాలు రాకపోకలు ఆగిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు, మినీ వాహనాలకు పాత వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు.
Similar News
News October 24, 2025
గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనకు ఆమోదం

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర చర్చకు దారి తీసిన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. కొందరు సభ్యులు విలీన వినతిని, వ్యతిరేకత ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరికొందరు మాత్రం వెంటనే ఆమోదించి విలీనాన్ని చూడాలని కోరారు. దీనిపై మేయర్ ప్రతిపాదన ఆమోదం కలెక్టర్‌కు పంపుతామన్నారు.
News October 24, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.
News October 24, 2025
మెదక్: జిల్లా యువజన క్రీడల అధికారిగా రమేష్

జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారిగా జి.రమేష్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జి.రమేష్ జిల్లా యువజన, క్రీడల అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు. ఆయన వెంట జిల్లా విద్యా శాఖాధికారి ప్రొ.రాధాకిషన్, ఏఎంఓ సుదర్శన్ మూర్తి ఉన్నారు.


