News August 5, 2024

పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా క్రీడాకారుడు

image

అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి పారిస్‌లో ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. షాట్‌పుట్‌లో రవి భారత్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. అతణ్ని క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం విక్రయించారు. ఆదాయపు పన్ను విభాగంలో అధికారిగా పనిచేస్తున్న రవి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని అన్నారు.

Similar News

News November 5, 2024

సింహాచలం: పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకోవచ్చు

image

సింహాచలం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేయించడం, పైఅంతస్తులు నిర్మించుకోవడం చెల్లదు. దీనిపై గతంలో కోర్టులు కూడా యథాతథస్థితిని ప్రకటించాయి. నిబంధనలు సడలిస్తూ దేవాదాయ శాఖ మెమో జారీ చేసింది. దీనిపై పంచ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News November 5, 2024

విశాఖ: 734 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీచర్ పోస్టులు అన్ని కేటగిరీల్లో కలిపి 734 ఖాళీలు ఉన్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటిలో జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలల్లో 625, మున్సిపల్‌ పాఠశాలల్లో 109 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ-తెలుగు) ఖాళీలు 205, ఉర్దూ 11 ఖాళీలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీలను తాజా నివేదికలో పొందుపరచలేదు.

News November 5, 2024

మాడుగుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు: చంద్రబాబు

image

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.