News September 13, 2024
పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలి: నంద్యాల కలెక్టర్
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా, మండల, గ్రామ పంచాయితీ అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా చూడాలన్నారు.
Similar News
News December 22, 2024
ఇంట్లో బంధించి మహిళపై ఆత్యాచారం.. నిందితుడికి రిమాండ్
మతిస్థిమితం లేని మహిళపై ఆత్యాచారం చేసిన జోగి హనుమంతును శనివారం రిమాండుకు తరలించినట్లు సీఐ మస్తాన్ వల్లి తెలిపారు. గత నెల 17న మతిస్థిమితం లేని మహిళను ఆదోనిలో అనాథాశ్రమంలో చేర్పిస్తానని మహిళ తల్లిదండ్రులతో నచ్చజెప్పి తీసుకొని జోగి హనుమంతు తన స్వగ్రామం ఆస్పరి మండలం ముత్తుకూరుకు తీసుకొచ్చాడు. ఇంటిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపామన్నారు.
News December 22, 2024
మత్స్య శాఖ వనరులను అభివృద్ధి పరచండి: కలెక్టర్
నంద్యాల జిల్లాలో మత్స్య శాఖ వనరులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి మత్స్య శాఖ ఉప డైరెక్టర్ రాఘవరెడ్డిని ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.
News December 21, 2024
రెవెన్యూ సదస్సులో 5,586 దరఖాస్తుల స్వీకరణ
కర్నూలు జిల్లా పరిధిలో ఈనెల ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 5,586 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. అలాగే శనివారం ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని కుర్నూరులో 11, పూలచింతలో 4, రాళ్లదొడ్డిలో 15, ఆగశన్నూరులో 11, కగళ్లులో 2, ముచ్చగేరిలో 1, ఆరెకల్‌లో 35, మార్లమడికిలో 13, కౌతాళంలో 51, పలు గ్రామాల్లో భూ సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.