News January 24, 2026
పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీజీఐఐసీ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు భూసేకరణ పూర్తయిన భూముల రికార్డు మ్యాపులను సిద్ధం చేయాలని చెప్పారు. రైతులకు చెల్లించిన పరిహారం వివరణపై పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.
Similar News
News February 16, 2026
విశాఖ తీరంలో మోహరించనున్న 90 నౌకలు

విశాఖలో నావికాదళ కమాండ్ సాముద్రిక ప్రాంగణంలో మిలన్ విలేజ్‌ను తూర్పు నావికాదళ చీఫ్ సంజయ్ భల్లా ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 71 నౌకలు, 19 విదేశీ యుద్ధ నౌకలు, 50 విమానాలు పాల్గొంటున్నాయి. నౌకలను ఆరు వరుసల్లో మొహరించనుండగా రాష్ట్రపతి సమీక్షించనున్నారు. మిలన్ నౌకాదళ విన్యాసంలో ప్రస్తుతం 65 దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి. 19న జరిగే సిటీ పరేడ్‌లో 45 దేశాల నౌకాదళ కంటెంజెంట్లు పాల్గొంటాయి.
News February 16, 2026
మంత్రి లోకేశ్‌తో కలసి క్రికెట్ చూసిన ఎంపీ సానా

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరుకు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, రాజ్యసభ సభ్యుడు, ACA కార్యదర్శి సానా సతీశ్ బాబు ప్రత్యక్షంగా వీక్షించారు. గ్యాలరీలో భారత జెండా ఊపుతూ జట్టు విజయాన్ని వీరు మనస్ఫూరంగా ఆస్వాదించారు.
News February 16, 2026
సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది?

గర్భాశయ ముఖద్వారం(Cervical Cervix)లోని కణాలకు సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) ఇది. చిన్నవయసులోనే పెళ్లిళ్లు-లైంగిక చర్య, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు కావడం ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. లైంగిక సంబంధాలతోనూ వ్యాపిస్తుంది. వంశపారపర్యం వల్ల రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత క్యాన్సర్ బయటపడుతుంది. అందుకే TG ప్రభుత్వం అమ్మాయిలకు ముందస్తుగా <<19154216>>వ్యాక్సిన్<<>> ఇవ్వనుంది.


