News October 12, 2025
‘పార్టీని బలోపేతం చేసే దిశగా DCC అధ్యక్షుల నియామకం’

కాంగ్రెస్ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. అందరి అభిప్రాయాలు, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని, జిల్లా అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 12, 2025
గన్నవరం జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో ఆదివారం ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. సైకిల్ పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా లారీ ఢీకొట్టింది. లారీ చక్రాలు మృతిని పై నుంచి వెళ్లడంతో అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు గన్నవరంలో ముఠా పని చేస్తుంటాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 12, 2025
అది టెక్నికల్ ఎర్రర్: అఫ్గాన్ మంత్రి

మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతివ్వకపోవడంపై అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ క్లారిటీ ఇచ్చారు. అది కావాలని చేసింది కాదని, టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగిందని తెలిపారు. భారత మీడియా, పొలిటీషియన్స్ నుంచి విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ఇందులో వివక్ష లేదని, కొద్ది మంది జర్నలిస్టులకే ఆహ్వానం పంపడంతో ఇలా జరిగిందన్నారు. కాగా ఇవాళ్టి ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం గమనార్హం.
News October 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 33 సమాధానాలు

1. రామాయణాన్ని విభజించే ముఖ్య భాగాలను ‘కాండము’ అని పిలుస్తారు.
2. సంస్కృత మహాభారతంలో 100 ఉప పర్వాలు ఉన్నాయి.
3. వేద వ్యాసుడి తండ్రి పరాశరుడు.
4. నేపాల్‌లో జరిపే తిహార్ పండుగలో శునకాన్ని సత్కరిస్తారు.
5. ‘క్షీరం’ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘పాలు’.
<<-se>>#Ithihasaluquiz<<>>