News November 27, 2025
పార్టీలకు అస్త్రంగా మారిన గుంపుల చెక్ డ్యాం

తనుగుల చెక్ డ్యాం కుంగుబాటు ఘటనను ప్రధాన పార్టీలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ ఆయా పార్టీల నేతలు ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇసుక మాఫియాను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నేతల పనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ నాణ్యతాలోపం వల్లే అంటూ BJP నేతలు ఆరోపిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పటి ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణాలు చేసిందంటూ ఇటు CONG ఆరోపిస్తోంది.
Similar News
News December 3, 2025
కడప జిల్లాలో 60,411 హెక్టార్లలో పంటల సాగు.!

కడప జిల్లాలో రబీ పంట సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 60,411 హెక్టార్లలో(43.21%) పంటల సాగు జరిగింది. కేసీ కెనాల్ నీటి విడుదలపై స్పష్టత కరువై వరి 526 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వరి, గోధుమ, కొర్ర, రాగి, జొన్న తదితర ధాన్యం పంటలు 2,086 హెక్టార్లలో సాగు చేశారు. పప్పు దినుసులు 56,106 హెక్టార్లలో, నూనె గింజలు 1,654 హెక్టార్లలో, వాణిజ్య పంటలు 16 హెక్టార్లలో సాగయ్యాయి.
News December 3, 2025
వీబీఆర్ పరిశీలనకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్సీలు

ఏపీ శాసనమండలి ఎమ్మెల్సీలు రామచంద్రా రెడ్డి, కవురు శ్రీనివాస్ నంద్యాలలో జరగనున్న ఏపీ శాసన పరిషత్ హామీల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం నంద్యాల వచ్చారు. వారికి కమిటీ ఛైర్మన్, స్థానిక నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా స్వాగతం పలికారు. ముందుగా వారు పరిశీలనలో భాగంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలించేందుకు వెళ్లారు. రేపు కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సమావేశం జరగనుంది.
News December 3, 2025
‘ఆయుష్మాన్ భారత్’ పరిధిని విస్తరించాలి: MP పురందేశ్వరి

ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించాలని రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈరోజు ఆమె పార్లమెంట్‌లో ముఖ్యమైన అంశం కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలిక, సాధారణ వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను పథకం పరిధిలో తక్షణమే చేర్చాలని, ఆసుపత్రి అనంతరం ఔషధాల కవరేజిని 15 రోజుల పరిమితిని విస్తరించి లబ్ధిదారులపై పడుతున్న అదనపు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని ఆమె కోరారు.


