News August 5, 2024
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత తప్పదు: కేటీఆర్

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతో ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
Similar News
News March 3, 2026
GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.
News March 3, 2026
మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.
News March 3, 2026
హుస్సేన్‌సాగర్‌కు కొత్త కళ

ట్యాంక్‌బండ్ తీరానికి కొత్త కళ రాబోతోంది. బుద్ధభవన్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల విస్తరణకు HMDA రూ.3.16 కోట్లతో పనులు చేపట్టనుంది. PVNR మార్గ్ వెంబడి తీరాన్ని పటిష్ఠం చేస్తూ రివెట్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. పనుల్లో భాగంగా 5,424 చదరపు మీటర్ల మేర అందమైన పెయింటింగ్స్‌తో గోడలను తీర్చిదిద్దనున్నారు. నాలుగేళ్ల గడువులోగా ఈ సుందరీకరణ పనులు పూర్తి చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది.


