News December 31, 2025

పార్లమెంట్ అటెండెన్స్‌: విజయనగరం ఎంపీకి 99%

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ ఏడాది పార్లమెంట్‌ అటెండెన్స్‌లో 99 శాతం సాధించారు. అన్ని సెషన్‌లలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో CAPF ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, విజయనగరంలో గానీ విశాఖలో SSB సెంటర్ ఏర్పాటు, జొన్నాడ టోల్ గేట్ రీలొకేట్ తదితర ముఖ్యమైన 11 డిబేట్‌లలో ఆయన చర్చించారు. అదేవిధంగా వివిధ అంశాలపై 127 ప్రశ్నలు సంధించారు.

Similar News

News January 2, 2026

VZM: డెడ్ బాడీ కలకలం

image

విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానాకి చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు. మృతుడికి 50-55 ఏళ్లు ఉంటాయని, నీలిరంగు ఫుల్ హాండ్స్ షర్టు, బ్లాక్ కలర్ జీన్ ప్యాంటు ధరించాడన్నారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు తెలపాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవి అన్నారు. కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపన దరఖాస్తులను వెంటనే పరిశీలించి వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. జిల్లాకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు కానున్న 8 ప్రధాన పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

News January 2, 2026

ఓడీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యాల సాధనకు వేగం పెంచాలి: VZM కలెక్టర్

image

టెలికాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ పూర్తయిన గ్రామాలను వెంటనే డిక్లేర్ చేయాలని, ఇప్పటికే డిక్లేర్ చేసిన గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రోజుకు 47 వేల మాన్‌డేస్ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలన్నారు.