News December 31, 2025

పార్లమెంట్ అటెండెన్స్‌.. విశాఖ ఎంపీకి 96%

image

విశాఖ MP శ్రీభరత్ ఈ ఏడాది పార్లమెంట్‌ అటెండెన్స్‌లో 96 శాతం సాధించారు. ఇండియన్ పోర్ట్స్ బిల్-225, దేశంలో అంధత్వ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార భద్రతా నిబంధనల బలోపేతం, విశాఖ ఓడరేవులో బొగ్గు&ఇనుప ఖనిజ రవాణా వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం వంటి 15 డిబేట్స్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా మొత్తం 113 ప్రశ్నలను సంధించారు.

Similar News

News January 1, 2026

విశాఖ జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన

image

న్యూఇయర్ వేడుకల వేళ విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సరికొత్త ఆలోచన చేశారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని అధికారులు, సిబ్బంది పూల బొకేలు, స్వీట్లు కాకుండా పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు ఉప‌యోగప‌డే విధంగా నెల‌కొల్పిన సంజీవ‌ని నిధికి విరాళాలు అందించాలని ఆయన సూచించారు. క‌లెక్ట‌ర్ త‌న కార్యాల‌యంలో గురువారం ఉద‌యం 9.30 నుంచి అందుబాటులో ఉంటారు.

News January 1, 2026

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో విశాఖలో పోక్సో చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పోక్సో కేసుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిందితుల్లో అధిక శాతం పరిచయస్తులే ఉంటున్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి పోలీసు, వైద్య శాఖల సహకారం కీలకమని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.