News July 24, 2024
పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కావ్య

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో తోటి ఎంపీలతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కావ్య మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Similar News
News February 11, 2026
WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
News February 11, 2026
హరిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ ఆర్డీఓ

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హరిత’ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఆర్డీఓ టి.సుమ బుధవారం సందర్శించారు. పర్యావరణ హితంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ కేంద్రాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు. పోలింగ్ సరళిని అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం, హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ దగ్గర సహచర అధికారులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు.
News February 11, 2026
వర్ధన్నపేట: ఓటర్లను ఆకట్టుకునేలా..!

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా అధికారులు హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఫిరంగిగడ్డ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో అధికారుల బృందం ఏర్పాటు చేయించిన హరిత పోలింగ్ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తోంది. హరిత పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. హరిత పోలింగ్ కేంద్రంపై ప్రజాస్వామ్యం-ఓటు హక్కు విలువలను తెలుపుతూ నినాదాలు రాయించారు.


