News July 25, 2024

పార్లమెంట్ వద్ద నిరసన.. పాల్గొన్న ZHB ఎంపీ

image

బడ్జెట్‌లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొనగా.. వీరి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సైతం పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు.

Similar News

News February 12, 2026

NZB: శాంతిభద్రతల కోసం పోలీసులకు సహకరించాలి: డీసీపీ

image

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలు, రాజకీయ నాయకులు శాంతిభద్రతల కోసం పోలీసులకు సహకరించాలని NZB అడిషనల్ DCP బస్వారెడ్డి కోరారు. గురువారం పోలీస్ అధికారులకు, సిబ్బందికి సమావేశం నిర్వహించారు. డీసీపీ బస్వారెడ్డి వారికి విధుల పట్ల దిశా నిర్దేశం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ ర్యాలీలు, సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని సూచించారు.

News February 12, 2026

NZB: ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు: కలెక్టర్

image

స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు.

News February 12, 2026

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాల్సిన విధానం గురించి వివరించారు.