News December 10, 2025
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో MP బాలయోగి

పార్లమెంట్‌లోని సీబ్లాక్‌లో జరిగిన కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమలాపురం MP గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈసమావేశంలో వలస కార్మికుల నైపుణ్య, భాషా శిక్షణ, PMKVY 4.0 పురోగతి వంటి అంశాలపై సమీక్ష జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ ‘డ్రాఫ్ట్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ను కమిటీ ఆమోదించింది.
Similar News
News December 13, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. నిషేధాజ్ఞలు అమలు

గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈనెల 14న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 13, 2025
రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
News December 13, 2025
మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.


