News March 2, 2025
పార్వతీపురంలో కుప్పలుగా తాగిపడేసిన సారా ప్యాకెట్లు

పార్వతీపురం నడిబొడ్డున గల వరహాలు గడ్డలో కుప్పలుగా తాగిపడేసిన సారా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అంటూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారా ప్యాకింగ్‌కు ప్లాస్టిక్ కవర్లు ఎలా దొరుకుతున్నాయని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, ఎక్సైజ్ అధికారులు సారా నియంత్రణలో భాగంగా నవోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ, సారా విక్రయాలు వారికి సవాల్‌గా మారాయి.
Similar News
News February 28, 2026
ఎక్కువగా తినడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయ్: సీఎం

అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. రావివలస ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల సుగర్ వస్తుందన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, రాగులు వంటి మిలెట్స్ వినియోగించాలని హితవు పలికారు. పూర్వం మన పెద్దలు అదే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేవారన్నారు.
News February 28, 2026
మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తే?

కెరీర్‌లో కోసం ఎక్కువ గంటలు పని చేయడం వల్ల మహిళలకు ఒత్తిడి, ఆందోళన పెరిగి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరగడం, ప్రీమెచ్యూర్ బేబీ, ఎదుగుదల లోపాలు, ప్రీఎక్లాంప్సీయా ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గినా.. ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు.
News February 28, 2026
22,195 ప్రభుత్వ ఉద్యోగాలు.. 2 రోజులే ఛాన్స్

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 2 లాస్ట్ డేట్. సికింద్రాబాద్ పరిధిలో 1,012 పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/


