News March 20, 2024

పార్వతీపురంలో బీటెక్ విద్యార్థి సూసైడ్

image

పార్వతీపురం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కుసుమగుడి వీధికి చెందిన కల్లూరి తారకేశ్వరరావు(20) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా అనే కారణంతో మనస్థాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడన్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై సంతోషి కుమారి వివరాలను నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Similar News

News April 3, 2025

కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

News April 3, 2025

VZM: ఈనెల 10 నుంచి ఉచిత కుట్టు శిక్ష‌ణ‌

image

విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డు కులాల‌కు చెందిన అభ్య‌ర్ధుల‌కు ఈనెల 10వ తేదీ నుంచి న‌గ‌రంలో ఉచిత కుట్టు శిక్ష‌ణ అందించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్ర‌శాంత్ కుమార్ గురువారం తెలిపారు. నాక్ ఆధ్వ‌ర్యంలో వీటీ అగ్ర‌హారంలో నిర్వ‌హిస్తున్న స్కిల్ హ‌బ్‌లో ఉచిత శిక్ష‌ణ ఉంటుందన్నారు. SC వ‌ర్గానికి చెందిన 18 నుంచి 45 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గల మ‌హిళ‌లు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.

News April 3, 2025

కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

image

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!