News March 12, 2025

పార్వతీపురంలో వైసీపీ ఆధ్వర్యంలో “యువత పోరు” 

image

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “యువత పోరు” కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని యువత పోరు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగారావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 4, 2025

HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

image

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభకు INC శ్రేణులు వందలాది వాహనాల్లో తరలివచ్చాయి. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్‌ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.

News July 4, 2025

HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

image

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్‌ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.

News July 4, 2025

ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

image

జిల్లాలో వరదలు ఎప్పుడు సంభవించిన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఆదుకునేందుకు మండలాల వారీగా ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా వరద సహాయక చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని, ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.