News July 1, 2024

పార్వతీపురం: అంతర్రాష్ట్ర రహదారిపైకి ఏనుగుల గుంపు

image

పార్వతీపురం నుంచి గుణుపూర్ (ఒడిశా) వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపైకి ఆరు ఏనుగుల గుంపు రావడంతో వాహన చోదకులు భయాందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం ఏనుగుల గుంపు గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపైకి వచ్చాయి. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో రహదారిపై ఉన్న ఏనుగులను సమీప పంట పొలాలకు వైపు సిబ్బంది వచ్చి తరలించారు. దీంతో రహదారిపై రాకపోకలు యథావిధిగా సాగాయి.

Similar News

News March 2, 2026

VZM: అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్లు

image

అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అన్నారు. మొద‌టి విడ‌త మంజూరు చేసిన అక్రిడేష‌న్ కార్డుల‌ను త‌మ ఛాంబ‌ర్లో అక్రిడేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌కు సోమ‌వారం క‌లెక్ట‌ర్ అంద‌జేశారు. మిగిలిపోయిన పాత్రికేయుల‌కు రెండో విడ‌త‌లో అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని చెప్పారు. జిల్లా అభివృద్దిలో పాత్రికేయులు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని కొనియాడారు.

News March 2, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 2, 2026

VZM: ‘జనావాసాల్లో ఉంచితే కేసులు నమోదు చేస్తాం’

image

బాణసంచా నిల్వ, తయారీ, విక్రయదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డిఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. విజయనగరం వన్ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దని, షాపులు-గోడౌన్ల వద్ద ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫైర్ అలారమ్స్, సురక్షిత వైరింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జనావాసాల్లో నిల్వ ఉంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.