News December 2, 2025

పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

image

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.

Similar News

News April 5, 2026

BREAKING: ఖానాపూర్ బీజేపీ కైవసం

image

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌలిక ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఓటింగ్‌లో ఏడుగురు కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలపడంతో, ఎన్నికల అధికారులు ఛైర్‌పర్సన్‌గా ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన ఈ ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైస్ ఛైర్మన్ ఎన్నిక కొనసాగుతోంది.

News April 5, 2026

నిర్మల్: రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’ రద్దు

image

నిర్మల్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపురద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, యంత్రాంగమంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News April 5, 2026

యువ అధికారుల పాలనలో గుంటూరు జిల్లా..!

image

గుంటూరు జిల్లాలో పాలన బాధ్యతలు యువ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సమన్వయం లోపంతో పురోగతి మందగించిందని భావించిన ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. వీరు భూ వివాదాలు, రేషన్ అక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు.