News April 13, 2025
పార్వతీపురం: ఇంటర్ ఫలితాల్లో గిరి విద్యార్థుల ప్రతిభ

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు DIEO మంజుల వీణ తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 947 మంది పరీక్షలు రాసి 920 ఉత్తీర్ణత సాధించగా 97.1 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 941 మంది పరీక్షలు రాసి 930 ఉత్తీర్ణత సాధించి 98.8 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు వివరాలు వెల్లడించారు.
Similar News
News February 28, 2026
తిరుపతిలో పోలీస్ అధికారులకు వీడ్కోలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించిన అధికారులు పదవీ విరమణ పొందారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. నాగభూషణరావు, సీఐ పి.శ్రీరాములు, ఏఎస్‌ఐ ఎస్. గోపీ, హెడ్ కానిస్టేబుల్ జి. రవిప్రకాశ్‌లను శాలువాలతో సత్కరించారు. శాఖకు వారు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ కొనియాడారు.
News February 28, 2026
కాకినాడ పేలుడు ఘటనపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

AP: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.
News February 28, 2026
ఎస్సార్ఆర్ కళాశాలలో ఘనంగా ‘సైన్స్ డే’

SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపల్ నితిన్, రాజయ్య, లెఫ్టినెంట్ రాజు, డాక్టర్ సంగీత, విభాగాధిపతి కిరణ్మయి, మహేష్, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.


