News March 22, 2024

పార్వతీపురం: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పార్వతీపురానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని దిగాలుగా ఉండడంతో, గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిపాడు. బెటర్ మెంట్‌లో మార్కులు తెచ్చుకోవచ్చని వారు సర్ది చెప్పినా, మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News April 20, 2025

మామిడి రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తాం: మంత్రి

image

జిల్లాలో మామిడి పండించే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, వారు ఎదగడానికి ఏ రకమైన సహకారం కావాలో తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరంలోని ఓ హోటల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు పంటను పరిరక్షించుకోడానికి కావలసిన సాంకేతికతను కూడా తెలుసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను కూడా తెలుసుకోవాలని తెలిపారు.

News April 19, 2025

పూసపాటిరేగ: విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి

image

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తన లాయర్లతో కలిసి శనివారం హాజరయ్యారు. సీఐ జి.రామకృష్ణ ఆమెను విచారించి పలు విషయాలు సేకరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. కాగా గతంలో నెల్లిమర్ల స్టేషన్‌లో శ్రీ రెడ్డిపై కేసు నమోదయింది.

News April 19, 2025

బొత్స వ్యూహాలు ఫలించేనా

image

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?

error: Content is protected !!