News April 9, 2025
పార్వతీపురం: ఈనెల 14న అంబేడ్కర్ జయంతి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 14న బీఆర్.అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్, మెయిన్ రోడ్డు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో సమావేశం జరుగుతుందని చెప్పారు.
Similar News
News April 18, 2025
NZB: రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు: కలెక్టర్

భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం ఏర్గట్ల మండలం బట్టాపూర్‌లో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఇది వరకు ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని చెప్పారు.
News April 18, 2025
NZB: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సుల రాకపోకల వివరాల కోసం ప్రత్యేకంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికులు బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం జ్యోత్స్న పేర్కొన్నారు. ఆర్మూర్-73828 43133, నిజామాబాద్-99592 26022, కామారెడ్డి-73828 43747, బోధన్-98495 00725, బాన్సువాడ-94911 05706 నంబర్‌లకు ఫోన్‌చేసి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News April 18, 2025
MHBD: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన తహశీల్దార్ల సంఘం

మరిపెడ, చిన్నగూడురులో ఏర్పాటు చేసిన సదస్సుల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ స్థానిక తహశీల్దార్లపై ఇసుక అనుమతుల విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మహబూబాబాద్ జిల్లా తెలంగాణా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ & తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖండించారు. G.O.Ms.No.3, G.O.Ms.No.15 ప్రకారం మాత్రమే తహశీల్దార్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని, ప్రత్యేక అధికారం లేదన్నారు.