News April 7, 2024
పార్వతీపురం: ఈ నెల 20న ఈఎంఆర్ఎస్ ప్రవేశపరీక్ష

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష వాయిదా పడినట్లు ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్-2 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20కు పరీక్ష వాయిదా వేసినట్లు తెలిపారు.
Similar News
News September 18, 2025
VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.
News September 18, 2025
పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.
News September 18, 2025
VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.